Friday, August 19, 2011

Gravy Capsicum and Arati Vucha Chitrannam

Gravy Capsicum & Arati Vucha Chitrannam

Cooking Time

: 30 Mins

Total Time

: 1 Hour

Ingredient
: Capsicum, Bengal Gram, Urad dal, Mustard, Tamarind, Peanut powder, Gingelly Powder, pepper powder, turmeric powder, Asafoetida , Garam Masala, Salt, Rice, banana stem, Curry leaves, Dry chilli, Green chilli
Description
:

1 Hour

Nutrition
:

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రొ విటమిన్స్ E, P, b1, b2, b3.

Ingredients
:

క్యాప్సికం గ్రేవీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :

శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, చింతపండు గుజ్జు, పల్లీల పొడి, నువ్వుల పొడి, మిరియాల పొడి, పసుపు, ఇంగువ, గరం మసాల, ఉప్పు.

అరటి ఊచ చిత్రాన్నం కావలసిన పదార్థాలు :

అన్నం, అరటిఊచ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పసుపు, ఇంగువ, శనగ పప్పు, మినప పప్పు, మినప పప్పు, ఉప్పు.

Instructions
:

క్యాప్సికం గ్రేవీ

తయారు చేసే విధానం :

బాణలిలో నూనె వేసి అది కాగాక అందులో కాప్సికం వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తరవాత అందులో చింతపండు గుజ్జు కాస్త నీరు, ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఉడికాక అందులో పల్లీల పొడి, నువ్వుల పొడి, మిరియాలపొడి, గరమమసాల వేసి ఉడకబెట్టాలి. అది ఉడికేలోపు ఇంకో బాణలి తీసుకుని అందులో కాస్త నూనె, మినప పప్పు, శనగ పప్పు, ఆవాలు, ఇంగువ, వేసి పోపు వేసుకోవాలి. తరవాత దీనిని ఉడుకుతున్న కాప్సికంలో వేసి దించేయాలి. క్యాప్సికం గ్రేవీ రెడీ.

అరటి ఊచ

తయారు చేసే విధానం :

స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్లు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న అరటి ఊచను వేసి, అందులో కాస్తంత పసుపు , ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఈ లోపు ఇంకో గిన్నెలో నూనె వేసి శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, చింత పండుగుజ్జు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. ఆ తరవాత ఉడికి మెత్తబడిన అరటి కాయను పోపులో కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తరవాత అందులో అన్నం కలిపి దించేయాలి. అరటి ఊచ పరమాన్నం రెడీ.

No comments:

Post a Comment