Thursday, August 11, 2011

శనగల చపాతీ

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 250grm
శనగలు:100grm
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి:2tsp
జీలకర్రపొడి:2tsp
కారం:2 tsp
నూనె:తగినంత

తయారు చేయు విధానము:
1. శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన శనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్‌లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి.
2. శనగలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన శనగల ముద్దలో గోధుమపిండి వేసి కలపాలి.
3. తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరవాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీపిండిలా కలుపుకుని గంటసేపు నాననివ్వాలి.
4. తరవాత గోధుమపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితోకాని నూనెతో కాని కాల్చుకోవాలి. ఈ చపాతీలు టొమాటోసాస్‌ తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment