Recipe Name
Preparation Time
Cooking Time
Total Time
1 Hour
గుమ్మడికాయ: కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్.
దొండకాయ కూర: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సోడియం.
గుమ్మడికాయ గుజ్జు పులుసు
గుమ్మడికాయ ముక్కలు , టమాట ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, మినపప్పు , చింతపండు గుజ్జు, పసుపు, బెల్లం, కొత్తిమీర, శెనగపప్పు , బియ్యం పిండి, జీలకర్ర, ఆవాలు, శెనగ పిండి, ఎండు మిర్చి, ఇంగువ.
దొండకాయ కూర
దొండకాయలు, ఉప్పు, పసుపు, ఎండు మిర్చి, చింతపండు గుజ్జు, శెనగపప్పు,మినపప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి.
గుమ్మడికాయ గుజ్జు పులుసు
తయారు చేయు విధానం:
ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకుని, అందులో తగినన్ని నీళ్ళు పోసి అందులో గుమ్మడికాయ ముక్కలను వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలను వేసి కాసేపు ఉడకనివ్వాలి . ఆ తరవాత టమాట ముక్కలను వేసి అవి ఉడికాక అందులో చింతపండు గుజ్జు వేయాలి. ఆ తరువాత ఉప్పు , పసుపు, కారం, బెల్లం వేసి మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి .
దానిలోపు ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్ ల బియ్యపు పిండి, 1 స్పూన్ శనగ పిండి వేసి ఉండల్లేకుండా కలుపుకుని ఉడికిన గుమ్మడికాయ మిశ్రమంలో వేసి కాసేపు ఉడకనివ్వాలి.
అది ఉడికేలోపు ఇంకో గిన్నెలో నూనె వేసి అది వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జిలకర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి తాళింపు వేసుకొని ఉడికిన గుమ్మడి కాయ మిశ్రమంలో కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ.
దొండకాయ కూర
తయారు చేయు విధానం :
ముందుగా ఒక బాణాలి తీసుకుని అందులో తగినంత నీళ్ళు పోసుకుని అందులో దొండకాయలు వేసి ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో కాస్త నూనె, శనగపప్పు, మినప్పప్పు , ఎండుమిర్చి వేసి వేయించి దించాక అందులో ధనియాలపొడి , ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై బాణలి పెట్టుకుని తగినంత నూనె వేసి జిలకర వేసి వేయించాక, ఉడికిన దొండకాయలు , కాస్త చింతపండు గుజ్జు, పసుపు, చిటికెడు కారం దానితో పాటు ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపి దించేయాలి . అంతే దొండకాయ కూర రెడీ.
No comments:
Post a Comment