Total Time
1 Hour
కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ.
దహికడి : శనగ పిండి, పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, జిలకర , ఆవాలు.
బేసన్ లడ్డు : శనగ పిండి, పౌడర్ లా చేసుకున్న చెక్కెర, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష.
దహికడి
ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కాస్త శనగపిండి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఆ తరవాత పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీరు కలిపి స్టవ్ పై పెట్టి మరగనివ్వాలి.
ఆ లోపు ఇంకో స్టవ్ పై డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ఆ లోపు ఇంకో గిన్నెలో బజ్జీలకు కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అందుకు 5స్పూన్ ల శనగపిండిలో సరిపడేంత సాల్ట్, తరిగిన పచ్చిమిర్చి, కాస్త పసుపు వేసి నీళ్ళు వేస్తూ బాగా కలిపి కాగిన నూనెలో చిన్న చిన్న బజ్జీల్లా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న బజ్జీలను వేడి వేడి పెరుగు మిశ్రమంలో వేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త నూనె వేసి స్టవ్ పై కాగనివ్వాలి. ఆవాలు, జిలకర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. ఆ పోపును బజ్జీలు వేసిన పెరగు మిశ్రమంలో కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ గా ఉంటుంది.
బేసన్ లడ్డూ
ఒక ప్యాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో శనగ పిండి వేసి ఉండలు కట్టకుండా దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో చక్కర పౌడర్ వేసి దించేయాలి. వేయించుకున్న శనగపిండి చల్లారాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి లడ్దూల్లా చేసుకోవాలి.
No comments:
Post a Comment