Preparation Time
Cooking Time
Recipe Type
Total Time
1 Hour
బెండి బేబీ ఆనియన్ కర్రీ
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సోడియం
స్టఫ్డ్ రైస్ పూరీ
ఫైబర్, మాంగనీస్ , సిలీనియం, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ 6, పొటాషియం, విటమిన్ సి, థయామిన్, ఫాస్ఫరస్.
బెండి బేబీ ఆనియన్ కర్రీ
అరకిలో బెండకాయలు , జిలకర 1 టీ స్పూన్, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు లేదా మూడు టీ స్పూన్ దానిమ్మ గింజల పొడి, టమాట తరుగు ఒక కప్పు, ఉల్లిగడ్డలు ఐదారు, ఎండుమిర్చి మూడు నాలుగు, పసుపు పావు టీ స్పూన్, పచ్చిమిర్చి చీలికలు అయిదారు, పుదీనా తరుగు రెండు, మూడు టీ స్పూన్లు, ఉల్లి తరుగు ఒక కప్పు, కొత్తిమీర తరుగు రెండు మూడు టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం ఒక టీ స్పూన్, నూనె తగినంత.
స్టఫ్డ్ రైస్ పూరీ
కావలసిన పదార్థాలు : బియ్యపు పిండి, గోధుమపిండి, మినప పిండి, ఉప్పు, నూనె, అన్నం, తగినన్ని నీళ్ళు కలిపి తయారు చేసుకున్న మిశ్రమం 2 కప్పులు , కాలీఫ్లవర్ తురుము ఒక కప్పు, ఉప్పు, కారం అర టీస్పూన్, కొత్తిమీర తరుగు రెండు , మూడు టీ స్పూన్లు, పుదీనా తరుగు ఒక టీ స్పూన్, జిలకర ఒక టీ స్పూన్, నూనె తగినంత.
బెండి బేబీ ఆనియన్ కర్రీ
తయారు చేసే విధానం : ముందుగా బాణలిలో నూనె పోసుకుని కాగాక జిలకర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి కాస్త ఫ్రై చేసి, అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, టమాట తరుగు, పసుపు, పుదీనా, ఉప్పు, కారం, బెండకాయలు , కరివేపాకు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో దానిమ్మ గింజల పొడి, కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి.
స్టఫ్డ్ రైస్ పూరీ
తయారు చేయవలసిన విధానం : ముందుగా బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి, అది కాగేలోపు పూరీ స్టఫ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా కాలీఫ్లవర్ తీసుకుని అందులో తగినంత ఉప్పు, కారం, జిలకర , కొత్తిమీర , పుదీనా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి, ఇప్పుడు పిండి మిశ్రమంలోంచి కాస్త పిండిని తీసుకుని చిన్న పూరీలా చేసుకుని వీడియోలో చూపిన విధంగా కాలీఫ్లవర్ మిశ్రమాన్ని అందులో పెట్టి పూరీలా వత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే స్టఫ్డ్ పూరీ రెడీ.
No comments:
Post a Comment